ప్రెస్ నోట్ మరియు ఫోటో కమీషనర్, గిరిజన సంక్షేమ శాఖ – ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య శిబిరం

Related image

Press Note 15.6.2022

గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగులకు హెల్త్ చెకప్: మాసబ్ టాన్క్ లో గల  గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు "కాల్ హెల్త్" వారి సహకారంతో పూర్తి స్థాయి ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి / కమీషనర్ డా. క్రిస్టినా జెడ్ చోంగు గారు ఈ క్యాంపును పరిశీలించారు. ఉద్యోగుల రిజిస్ట్రేషన్ తో కాల్ హెల్త్ వారి ఆధ్వర్యంలో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉదయం గం. 9 నుంచి సాయంత్రం గం.5 వరకు 245 మంది ఉద్యోగులకు  రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, ఇ. సి. జీ లాంటి (CBP, LFT, CUE, SR, RBS, TCH, కొలెస్ట్రాల్ వగైరా) హెల్త్ పరీక్షలు నిర్వహించారు. తమ శాఖ ఉద్యోగులందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ పరీక్షలు చేయించామని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చోంగ్తు అన్నారు. ఈ కార్యక్రమాన్ని అనుకున్నట్లు సజావుగా సాగించినందుకు శాఖ అదనపు సంచాలకులు, శాఖకే చెందిన 'కాల్ హెల్త్సెం టర్' నిర్వాహకులు, ఇతర అధికారులను అభినందించారు. వేల రూపాయలు ఖర్చు చేసే చేయించుకునే ఇన్ని పరీక్షలు ఒకే చోట, ఒకేసారి చేయడం పట్ల ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేశారు.

     

More Press Releases