ఈనెల 18, 19 తేదీలలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు శిక్షణా తరగతులు: అల్లం నారాయణ

Related image

హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ తరఫున జూన్ నెలలో రెండు జర్నలిస్తుల శిక్షణా తరగతులు ఉన్నాయి. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలలో శిక్షణ తరగతులను విజయవంతంగా అకాడమీ నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు శిక్షణా తరగతులను ఈనెల 18, 19 తేదీలలో నిర్వహిస్తున్నది. అట్లాగే గంగా జమునీ తెహజీ్బ్ కి నమూనాగా నిలిచిన హైదరాబాద్ లో ఉర్దూ జర్నలిస్టులకు జూన్ 25, 26 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

ఉర్దూ జర్నలిజం ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని సంస్కృతులకు అలవాలమై ఉన్న హైదరాబాద్ లో అన్ని భాషలు ఆదరించబడ్డాయి. ఉర్దూ పత్రికలు రెండు వందల సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా మొదటిరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమ్మద్ మహమూద్ అలీ ప్రముఖ ఉర్దూ పత్రికల ఎడిటర్లు ఎలక్ట్రానిక్ మీడియా సీఈవో లు ఎంఎల్ఏ లను అతిథులుగా ఆహ్వానించి ఘనంగా ఉత్సవంగా తరగతులు జరుపుతున్నట్లు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల శిక్షణ తరగతుల మొదటిరోజు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, నగర ఎంఎల్ఏ లు అతిథులుగా పాల్గొంటారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం మెరుగుపరిచేందుకు అవసరమైన పత్రికల భాష- తప్పులు, సిటీ వార్తలు, రెండవ రోజు మీడియా లో నైతిక ధోరణులు, డిజిటల్ మీడియా, నేర వార్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారితాలు అంశాలపై తరగతులు ఉంటాయి. ఉర్దూ జర్నలిస్టుల శిక్షణా తరగతుల మొదటి సెషన్ లో ఉర్దూ జర్నలిజం రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్ద ప్రతిష్ఠులైన ప్రముఖులు ప్రసంగిస్తారు.

ఆ తర్వాత సెషన్ లో నేటి మీడియా ధోరణలు, నేర వార్తలు, తరువాతి రోజు తర్జుమా -భాష, సోషల్ మీడియా వికృత ధోరణలు, జాతీయ మీడియా ధోరణలు, రిపోర్టింగ్ మెలకువలు తదితర అంశాలపై తరగతులు ఉంటాయి. దీని ముగింపు సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, జాఫ్రీ, వాణి దేవి, ప్రభాకర్ రావు ,అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే ఈ రెండు శిక్షణ తరగతులలో పాల్గొనే జర్నలిస్టులకు మీడియా అకాడమీ సర్టిఫికెట్లు ఇస్తుంది. జర్నలిస్టులు ఈ రెండు శిక్షణా తరగతులలో పాల్గొని విజయవంతంగా చేయవలసినదిగా అకాడమీ చైర్మన్ కోరారు.

శిక్షణ తరగతుల నిర్వహణకై అవసరమైన ఏర్పాట్లు సలహాల కోసం ఇవ్వాళ్ళ జరిగిన సన్నాహక సమావేశంలో అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ మారుతి సాగర్, సీనియర్ జర్నలిస్టులు మాజిద్, హబీబ్ అలి అల్ జిలాని,అంజద్ అలీ, సయ్యద్ గౌస్ మొహియుద్దీన్, మొహసిన్, హైదరాబాద్ టీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ యోగి, జనరల్ సెక్రెటరీ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Allam Narayana
Media Academy
Telangana

More Press Releases