విధి నిర్వహణలో కార్మికులు సమయపాలన పాటించాలి: వీఎంసీ కమిషనర్
మెరుగైన పారిశుధ్య నిర్వహణ అమలు చేయాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ నందు 23వ డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఉదయం గం.10.30 గంటలకు ఎఫ్ఆర్ఎస్ మస్తరును పరిశీలించారు. ఈ సందర్భంలో కార్మికలకు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరములలో వైద్య పరిక్షలు నిర్వహించుకోన్నది లేనిది అడిగితెలుసుకొని, వారి క్షేమ సమాచారములను వాకబు చేసి వేసవి తీవ్రత దృష్ట్యా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. విధి నిర్వహణలో కార్మికులు విధిగా సమయపాలన పాటిస్తూ, పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రకారం తమకు కేటాయించిన ప్రదేశాలలో పారిశుధ్య పనులు నిర్వహిస్తూ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ అమలు చేయాలని పరిసరాలు అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.
అదే విధంగా నివాసాల నుండి ఇంటింటి చెత్త సేకరణ సమయంలో ప్రజలకు తడి మరియు పొడి చెత్తలను వేరు చేసి అందించుట మరియు ప్లాస్టిక్ వాడకం నిషేధం, పరిసరాల శుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించునట్లుగా చూడాలని సూచించారు.