నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా అభివృద్ధి పనులు: వెల్లంపల్లి

Related image

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ నందు నగరపాలక సంస్థ సాధారణ నిధుల రూ. 30.83 లక్షల అంచన వ్యయంతో ఏర్పాటు చేసిన సి.సి రోడ్లను మంగళవారం పశ్చిమ నియోజకవర్గ  శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ తో కలసి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంలో శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధియే లక్షంగా డివిజన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరిగిందని అన్నారు. నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్లను అభివృద్ధి పరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, డివిజన్ లలో డ్రెయిన్లు, రోడ్ల మర్మమ్మత్తులు వంటి అనేక అభివృద్ధి పనులతో పాటుగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకములు అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి వాటిని చేరువ చేసి, సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్దిదారులకు అందించుట జరుగుతుందని అన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి

నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికీ మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు నగరపాలక సంస్థ అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని, దానిలో భాగంగా ఈ డివిజన్లో రూ. 30.83 లక్షల అంచనాలతో  రోటరీ నగర్ మెయిన్ రోడ్ మరియు పలు అంతర్గత రోడ్లను సి.సి. రోడ్లుగా అభివృద్ధి చేసి ప్రారంభించుకోవటం జరిగిందని అన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా డివిజన్ లలో స్థానిక కార్పొరేటర్ల  అభ్యర్ధన మేరకు డివిజన్ లలో పనులు చేపట్టి వాటిని నిర్దేశిత గడువులోపుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని వివరించారు.

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య తో పాటుగా పాటుగా పలువురు కార్పొరేటర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

More Press Releases