తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఫుల్ డ్రెస్ రిహార్సల్ పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, మే 31: జూన్ 2 వ తేది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి  పూర్తి డ్రెస్ రిహార్సల్‌ పరేడ్ ను వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖరరావు జూన్ 2 న పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం, ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబందించింపూర్తి రిహార్సల్ ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిద్ కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సీఎస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్,  ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి. దానకిషోర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ అధికారులు హాజరయ్యారు.  

Somesh Kumar
Hyderabad

More Press Releases