గిరిజన విద్యార్ధులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

హైదరాబాద్: గిరిజన గురుకులాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే అనేక రకాల అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. సోమవారం ఇక్కడి సంక్షేమ భవనంలో ఆర్జేసీ సెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు. 

రాష్ట్రంలోని 83 గిరిజన కళాశాలల్లో ఉన్న 8200 సీట్లకుగాను 26042 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. ప్రకటించిన ఫలితాలలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి ప్రతిభ కళాశాలల్లో ప్రవేశమిస్తారు. ప్రతిభ కళాశాలల్లో 1140 సీట్లున్నాయి. వీరికి ఐఐటి, ఎన్ఐటి, నీటి వంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణనిస్తారు. మిగిలిన కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్, కామర్స్ కోర్సులతోపాటుగా వృత్తి విద్య కోర్సుల అందుబాటులో ఉన్నాయి. 

ప్రతిభ కళాశాలల్లో సీట్లన్నీ ఎస్టీ విద్యార్ధులకే పరిమితం కాగా జనరల్ కళాశాలల్లో ఇతరులకు ప్రతి గ్రూపులో ఒక్కొక్క సీటు రిజర్వ్ చేయబడుతుంది. 27-03-2022 నాడు ఈ ఆర్జేసీ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించడం జరిగింది. ఫలితాలు ప్రకటించిన కార్యక్రమంలో గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శి సర్వేశ్వర్ రెడ్డి, ఉప కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఇతర గురుకుల అధికారులు పాల్గొన్నారు.

Satyavathi Rathod
Hyderabad
Telangana

More Press Releases