ఇంధన మంత్రి జగదీష్ రెడ్ది ప్రెస్ నోట్ మరియు ఫోటోలు

Related image


*@న్యూజెర్సీ నుండి*

    

*సంస్కృతి,సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది*

* వాటినిసంరక్షించాల్సినబాధ్యతమనందరిది*

*వర్తమానానికిసంస్కృతి, సంప్రదాయాలు అలవర్చాలి* 

*అందులో ప్రవాసులు ముందుండాలి* 

 *మానవీయ కోణాన్ని బతుకమ్మఆవిష్కరించింది*

 *అమెరికాలో T T A సేవలుభేషుగ్గాఉన్నాయి*

 *లాభాపేక్ష లేకుండా తెలంగాణ ఉనికిని TTA చాటుతోంది*

 *మంత్రి జగదీష్ రెడ్ది*


 *అమెరికాలోనీ న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్ లో తెలంగాణా అమెరికా తెలుగు సంఘం మేఘా కనివెన్షన్ ప్రారంబించిన మంత్రి జగదీష్ రెడ్డి*

*యన్ ఆర్ ఐ ల ఘనస్వాగతం*

*మంత్రి జగదీష్ రెడ్డి కి ఘన సన్మానం*



సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ప్ర పంచంలో ఎక్కడా ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణా కు మాత్రమే కలిగి ఉండడం మన అదృష్టం అని ఆయన చెప్పారు.ప్రపంచంలో ఎన్నో జాతులు వచ్చి పోయాయని ప్రస్తుతం ఉన్న మూడు వేల పై చిలుకు జాతులలో ఒక్క తెలంగాణ కు మాత్రమే మానవీయ కోణాన్ని ఆవిష్కరించే రీతిలో అంగం ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన బతుకమ్మ సంప్రదాయం మనకు సొంతం అయిందన్నారు.అటువంటి బతుకమ్మ వారసత్వాన్ని కొనసాగించే గురుతరమైన బాధ్యత నేటి తరం మీద ఉందన్నారు. అమెరికాలోనీ న్యూజెర్సీలో మూడురోజులుగా జరుగుతున్న తెలంగాణా అమెరికా
తెలుగుసంఘం (T T A ) మేఘా కనివేన్షన్ ను న్యూజెర్సీ కనివేన్షన్కేం ద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.T T A ప్రతినిధి ఫైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను వర్తమాననికి అందించాలని ఆయన కోరారు. అందులో ప్రవాసులు ముందుండలన్నారు.బతుకమ్మ తో పాటు బోనాలు,గ్రామదేవతల పేరుతో నిర్వహించే జాతరల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయసాల కొనర్చి తెలంగాణా ఉనికిని అమెరికాలో చాటేందుకు గాను ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు పోతున్న (T T A )తెలంగాణా అమెరికా తెలుగు సంఘాన్ని ఆయన అభినందించారు.ప్రవాసులు పుట్టి పెరిగిన చోట ఇప్పటికి ప్రభుత్వ సేవలు అందని పక్షంలో అక్కడ సేవలు అందించెందుకు ప్రవాసులు ముందుకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.T T A ప్రస్తుత చైర్మన్ మోహన్రె డ్డి టి ఆర్ యస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

*మంత్రి జగదీష్ రెడ్డికి ఘన సన్మానం*
    
 
కార్యక్రమం అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రె డ్డికి తెలంగాణా అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణా అమెరికా తెలుగు సంఘం సమావేశానికి హాజరయ్యేందుకు న్యూజెర్సీకి చేరుకున్న మంత్రి జగదీష్రె డ్డికి యన్ ఆర్ ఐ లు ఘనంగా స్వాగతం పలికారు.







More Press Releases