పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: వీఎంసీ కమిషనర్
- ప్రతి శనివారం విధిగా క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాలి
- నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా అయన ఛాంబర్ శుభ్రపరచుకొని, ఛాంబర్ నందలి వేస్ట్ పేపర్ లను కటింగ్ మిషన్ నందు వేసి, ఇదే విధంగా అన్ని విభాగములలో వేస్ట్ పేపర్ లను విధిగా సదరు కటింగ్ మిషన్ ద్వారా ముక్కలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల శుభ్రతా ప్రతి ఒక్కరి భాద్యత అని, ప్రధాన కార్యాలయంతో పాటుగా సర్కిల్స్ మరియు సచివాలయాలలో కూడా ప్రతి శనివారం శుభ్రతా కార్యక్రమములను విధిగా నిర్వహించుట జరుగుతుందని వివరించారు.
నగరపాలక సంస్థ నందలి ఇతర విభాగములలో సిబ్బంది నిర్వహిస్తున్న శుభ్రతా పనులను క్షేత్ర స్థాయిలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల పర్యవేక్షించి ప్రతి శనివారం సిబ్బంది విధిగా క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ, తమతమ కార్యాలయాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. మినిస్ట్రీయల్ సిబ్బంది వారి వారి అల్మారాలలోని పాత ఫైల్స్ అన్నియు రికార్డు నందు నమోదు చేసుకొని రికార్డు రూమ్ నందు భద్ర పరచుకొని, ఫైల్స్ డిస్పోజ్ చేయునట్లుగా చూడాలని సూపరింటిoడెంట్ లను ఆదేశించారు.
కొండపల్లి హౌసింగ్ లేఔట్ స్థలముల పరిశీలన.. అధికారులకు పలు ఆదేశాలు:
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు జగనన్న గృహ నిర్మాణలకు సంబందించి కేటాయించిన కొండపల్లి నందలి లేఅవుట్ ను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంలో కొండపల్లి నందలి సుమారు 37 ఎకరాలలో 2060 మంది లబ్దిదారులకు జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకం క్రింద స్థలములను కేటాయించుట జరిగిందని హౌసింగ్ అధికారులు కమిషనర్ కి వివరించారు.
దీనిపై సదరు లేఔట్ స్థలములలో లబ్దిదారుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎంపిక కాబడిన లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే విధంగా వారిని చైతన్యవంతులను చేయవలసిన భాద్యత అడ్మిన్ సెక్రెటరి, వార్డ్ ఎనిమిటి, వెల్ఫేర్ సెక్రెటరి, వాలెంటరీ మరియు వి.ఆర్.ఓ లపై ఉందని అన్నారు.
అదే విధంగా లేఔట్లలో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనులు వేగవంతముగా చేపట్టి పూర్తి చేయునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు బ్యాంకుల నుండి బుణాలు సత్వరమే మంజూరు చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో ప్రజల ముంగిట అవగాహన కార్యక్రమము:ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నవి, ఆ పథకాల ప్రయోజనాలు పొందుటకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అర్హత కలిగి తగిన అవగాహన లేక లబ్ది పొందలేని ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించు 543 రకాల సేవలు సంక్షేమ క్యాలెండరు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు, సామజిక పెన్షన్ పథకము, మాతా శిశు సంరక్షణ చర్యలు తదితర అనేక పథకముల గురించి వారి ఇండ్ల వద్దనే పూర్తిగా అవగాహన కల్పించు లక్ష్యంతో ప్రతి నెల చివరి శుక్ర, శనివారము యందు అన్ని సచివాలయముల పరిధిలో సచివాలయ సిబ్బంది 'సిటిజన్ అవుట్ రీచ్' కార్యక్రమము చేపట్టుటకు ప్రభుత్వం ఆదేశించినది.
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఈ పర్యాయము సిటిజన్ అవుట్ రీచ్ నందు మిగిలిన అన్ని పథకములపై అవగాహనతో పాటుగా ప్రత్యేకంగా జగనన్న గృహ లబ్దిదారులకు అవగాహన కల్పించు బృహత్తర ఆలోచనతో ప్రత్యేక కార్యాచరణతో లబ్దిదారుల జాబితాను వాలంటిర్ వారిగా కేటాయించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, వారిని సచివాలయ కార్యదర్శులకు జత చేసి ప్రతి వారం ఆయా సచివాలయము మొత్తం లబ్దిదారులలో 10% లక్ష్యంగా నిర్దేశించి మరల కార్యదర్శి వారిగా రోజు వారి టార్గెట్ నిర్ణయించి లబ్దిదారులకు గృహ నిర్మాణముపై గల సందేహాలను నివృత్తి చేసి వారు గృహ నిర్మాణము చేపట్టునట్లుగా చూడవలసినదిగా ఆదేశించిరి.
దీనిలో భాగంగా ఈ శనివారం కమిషనర్ క్షేత్ర స్థాయిలో సర్కిల్-1, 50వ డివిజన్ 175వ సచివాలయo మరియు సర్కిల్-2 31వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించుటతో పాటుగా గృహ నిర్మాణము కొరకు ప్రభుత్వం వారు మంచి విలువ కలిగిన స్థలమును పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి చక్కటి వాతావరణం కల్పించి దాదాపు 10 లక్షల రూపాయలు విలువల ఆస్తిగా సమకూర్చి ఇస్తున్నారని అన్నారు. కావున లబ్దిదారులు ముందుకు వచ్చి గృహ నిర్మాణం చేపట్టవలేనని అవగాహన కలించుట జరిగింది. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల ద్వారా బుణ సదుపాయం కల్పించబడుచున్నదని తెలియజేసారు.
ఈ సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమములో పలు టెలికాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ వారు ఇచ్చిన సూచనల మేరకు సచివాలయ వాలెంటిరు నుండి శాఖాధిపతుల వరకు ప్రతి ఒక్కరు నిర్దేశిత లక్ష్యముల మేరకు ప్రజల ముంగిటకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించిరి.