పర్యాటకులను ఆకర్షించేలా గాంధీ కొండ అభివృద్ధికి చర్యలు: వీఎంసీ కమిషనర్
- ఆకర్షణియంగా తీర్చిదిద్దుటకు డిజైన్ మరియు ప్రణాళికలను రూపొందించాలి
ఇందుకు కొండపైకి వెళ్లు ఘాట్ రోడ్ నందలి సెక్యురిటి ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించే విధంగా చూడాలని అన్నారు. అదే విధంగా ఘాట్ రోడ్ అంచుల వెంబడి గల గోడలు కొన్ని చోట్ల ఎత్తు తక్కువగా మరియు కొన్ని చోట్ల గోడలు లేకుండా ఉండుట గమనించి గోడలను ఎత్తు పెంచాలని మరియు అవసరమైన ప్రదేశాలలో గోడల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంలో గాంధీ హిల్ ఫౌండేషన్ వారితో సమావేశం ఏర్పాటు చేయుటతో పాటుగా పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమగు డిజైన్ మరియు ప్రణాళికలను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
తదుపరి బి.ఆర్.పి రోడ్, గణపతిరావు రోడ్, నెహ్రు రోడ్ మొదలగు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలిస్తూ, గణపతిరావు రోడ్ నందు ఎక్కువగా ఆవులు ఉండుట గమనించి పశువుల యజమానులు ఎవరు పశువులను రోడ్లపైకి వదలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందలి పనుల పురోగతిని పర్యవేక్షించి అధికారులను పనుల వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు.
పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వి.శ్రీనివాస్ మరియు శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.