రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష

Related image

హైదరాబాద్, మే 20: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని అన్నారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవి సమ్మేళనం రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జిఎడి కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవి ఆనంద్, జల మండలి ఎండి దాన కిషోర్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకెష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలతో పాటు పోలీసు, రోడ్లు భవనాలు, విధ్యుత్, సమాచార శాఖ, ఉద్యాన వన శాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Somesh Kumar
Telangana

More Press Releases