నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

Related image

విజయవాడ: సర్కిల్ -1 పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలసి పరిశీలించి నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతము చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముందుగా విధ్యాధరపురం డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నందలి ఫిల్టరేషన్ మీడియా మార్పు పనులు మరియు ప్లాంట్ నిర్వహణ, రా వాటర్ శుద్ధి చేయు విధానము మొదలగు వాటిని పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, వాటర్ వర్క్స్ నందు గ్రీనరీ పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదే విధంగా హెచ్.బి కాలనీ మెయిన్ రోడ్ మరియు హెల్త్ సెంటర్ యొక్క నిర్మాణ పనులను పరిశీలిస్తూ, మెయిన్ రోడ్ పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి అయినందున ఫ్లేవర్  బ్లాక్స్ సక్రమంగా పరిచిన తదుపరి మరల తనిఖి నిర్వహించేదనని తెలిపారు. తదుపరి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులకు సంబందించి రీబౌండ్ హ్యామర్ తో కాలమ్స్  యొక్క నాణ్యతను పరిశీలించారు. కబేళ సెంటర్ హెల్త్ సెంటర్, 44వ డివిజన్ కమ్యూనిటీ హాల్, చిట్టినగర్ టి.పి రోడ్ నందలి బి,టి రోడ్ నిర్మాణ పనులు మరియు హనుమంతరావు చేపల మార్కెట్ తదితర ప్రాంతాలలో జరుగుతున్న పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంలో చేపల మార్కెట్ ప్రాంతములో రోడ్లపై కోళ్ళ బాక్స్ లు ఉండుట గమనించి ఆ ప్రాంతంలో ఎటువంటి సామగ్రి లేకుండా చూడాలని మరియు ఆయా ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. అనంతరం పూర్ణానంద పేట నందలి సీసీ రోడ్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ, పూనూరి వారి వీధిలో స్థానికుల అభ్యర్ధన మేరకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పర్యటనలో ఎగ్జీక్యుటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases