Koppula Eshwar, Minister for SC Development and Minority Welfare held a review meeting

Related image

జె.పి., మౌలాలి,పహడీషరీఫ్ దర్గాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

అనీసుల్ గుర్భా నిర్మాణం,మక్కా మసీదు మరమ్మతులు వెంటనే పూర్తి కావాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

క్రిస్టియన్ భవన్, అజ్మీర్ లో అషూర్ ఖానా నిర్మాణాలలో నెలకొన్న అడ్డంకులను తొలగించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రభుత్వోద్యోగాలు పొందేందుకు మైనారిటీ యువతకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష జరిపారు. హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు రెండున్నర గంటల పాటు జరిపిన సమీక్షా సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్,కార్యదర్శి అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్,పహడీషరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సుమారు రెండున్నర గంటల పాటు సమీక్షా జరిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 4 ఎకరాలు సేకరించడం గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టరు తో  త్వరలో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భా,చారిత్రాత్మక మక్కా మసీదులో కొనసాగుతున్న మరమ్మత్తుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మక్కామసీదు పనులను నెల రోజుల్లో,అనీసుల్ గుర్భాను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి హామీనిచ్చారు.కోకాపేటలో ప్రతిపాదిత క్రిస్టియన్ భవన్, రాజస్థాన్ లోని అజ్మీర్ లో అషూర్ ఖానా నిర్మాణాలకు సంబంధించి నెలకొన్న అడ్డంకులను తొలగించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి కొప్పుల Wakf Board కు చెందిన ఆస్తులను లీజుకిచ్చే విషయమై సమగ్ర నివేదిక రూపొందించాల్సిందిగా మంత్రి ఈశ్వర్ అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం పెద్ద ఎత్తున వెలువడుతున్న నోటిఫికేషన్ల విషయమై మంత్రి ప్రస్తావిస్తూ..మైనారిటీ యువత ఓపెన్ కేటగిరీలో కూడా గొప్పగా రాణించే విధంగా అత్యుత్తమ శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.


      


Koppula Eshwar
TRS

More Press Releases