ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం: విజయవాడ మేయర్
- అభివృద్ధి దిశగా తూర్పు నియోజకవర్గం
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో రెండు సీసీ రోడ్లు, మరియు కరెన్సీ నగర్ పార్కు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో దేవినేని అవినాష్ కృషితో అభివృద్ధి దిశగా పయనిస్తుందని, రాబోవు రోజులలో చేపట్టిన అన్ని పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. డివిజన్ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలలో అభివృద్ధికి శ్రీకారం వైసీపీ ప్రభుత్వం: తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్
గతంలో అభివృద్ధికి నోచుకోని డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. కొండ ప్రాంతాలలో కూడా త్రాగునీటి, డ్రెయిన్ మరియు రోడ్ల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. నేడు శంకుస్థాపన చేసిన రోడ్లు కాని, యూజీడీ పైప్ లైన్ కానీ, పార్కులుగని అన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమములో కో-ఆప్టేడ్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.