ప్రగతి భవన్ జనహితలో శుభకృత్ ఉగాది వేడుకలు

Related image

హైదరాబాద్, మార్చి 29: తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2 వ తేదీన ప్రగతి భవన్ లోని  జనహిత లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అధర్ సిన్హా, అర్వింద్ కుమార్, నగర పోలీస్ కమీషనర్ సివీ ఆనంద్, అడిషనల్ డీజీ అనీల్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ కమీషనర్ అనీల్ కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతీ భవన్ లోని జనహితలో ఏప్రిల్ రెండవ తేదీ ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదపండితుల ఆశీర్వచనం అనంతరం బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ చే పంచాంగ పఠనం ఉంటుందని తెలిపారు. వేదపండితులకు ఉగాది పురస్కారాలు అందచేసిన అనంతరం ముఖ్యమంత్రి సందేశం ఉంటుందని అన్నారు. అదేరోజు సాయంత్రం ఆరున్నరకు రవీంద్ర భారతి లో కవిసమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తాయని తెలిపారు. ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ లోని కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.

ugadhi
Somesh Kumar
Telangana

More Press Releases