ఘనంగా హోంమంత్రి మహమూద్ అలీ జన్మదిన వేడుకలు

Related image

హైదరాబాద్: రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ జన్మదిన వేడుకలు బుధవారం నాడు హైదారాబాద్ లో జరిగాయి. పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు హోం మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు కె టి రామారావు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు హోం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎమ్మెల్సీ కవిత, పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్, బిబి పాటిల్, శాసనసభ్యులు అంజయ్య యాదవ్, రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, హోం సెక్రటరీ రవి గుప్త, ఇంఛార్జి డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్ లు సివి ఆనంద్, మహేష్ భగవత్, జైళ్ల శాఖ డీజీపీ జితేందర్, సిటీ అడిషనల్ సిపి ఏ ఆర్ శ్రీనివాస్, జాయింట్ సిపి రమేష్ రెడ్డి, తదితరులు హోం మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Md Mahamood Ali
Telangana

More Press Releases