తెలంగాణ జాగృతి సంస్థ కృషిని కొనియాడిన మంత్రి కేటీఆర్!

Related image

తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబిచ్చిన మంత్రి కేటీఆర్ పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అని అన్నారు. దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నారు.

నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్ పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే, హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందన్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతే అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత, దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

KTR
TRS
Telangana
K Kavitha
bathukamma

More Press Releases