వాణిజ్య సముదాయాలలో ఖాళీగా ఉన్న షాపులను భర్తీ చేయాలి: వీఎంసీ కమిషనర్ రంజిత్ భాషా
- పార్క్ లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
అదే విధంగా ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ గల షాపుల వివరాలు మరియు ఇతర వాణిజ్య సముదాయాల వివరాలు వాటి యొక్క ఆదాయ వనరులు మొదలగు అంశాలను ఎస్టేట్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంలో కాంప్లెక్స్ నందలి పాడైన షాపుల షట్టర్ లకు తగిన మరమ్మత్తులు చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని ఆదేశిస్తూ, కాంప్లెక్స్ లలో గల అన్ని ఖాళీ షాపులను భర్తీ చేసి ఆదాయ వనరులు పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా కాంప్లెక్స్ నందలి పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచే విధంగా చూడాలని, ఇంకను ఏమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించాలని సూచించారు.
తదుపరి లెనిన్ సెంటర్ పార్క్ మరియు సింగ్ నగర్ ప్రాంతములోని పాయకాపురం చెరువు నందు జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనుల యొక్క పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా పార్క్ నందు ఆకర్షనీయమైన మొక్కలు నాటి పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.