మేడారం జాతరలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచిన గిరిజన నృత్యాలు
మేడారం: శనివారం రోజున జాతర ఆఖరి రోజులో భాగంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాల నృత్యాలతో జాతర పరిసర ప్రాంతాలు మారుమోగాయి. తెలంగాణ గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన కళారంగానికి తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కోయ కొమ్ము డాన్స్.. నాయకపోడు నృత్యాలు అత్యంత ప్రజాధారణ పొందాయి. అదే విధంగా అదిలాబాద్ గోండు నృత్యం గోండు జాతి సాంస్కృతికి తగ్గట్టుగా ఉంటుంది. భద్రాచలం ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన కళాకారుల పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు. గిరిజన కళాకారులు కళారంగంలో రాణిస్తూనే వారి కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నారు. మేడారం జాతరలో గిరిజన కళాకారులు చేసిన నృత్యాలకు జాతరలో భక్తులు ప్రశంసల వర్షం కురిపించారు.
శానిటేషన్ పని తీరు అద్భుతం:మేడారం శ్రీ సమ్మక్క సారాలమ్మ మహజాతరలో పారిశుధ్యం పనితీరును పలువురు ప్రశంసిస్తున్నారు. లక్షల మంది వచ్చే ఈ జాతరకు ప్రస్తుతం కోటికి పైగా తరలిరావడం, జాతరకు వస్తున్న జనాభాతో వారం రోజులుగా 24గంటలు ఎటువంటి విరామం లేకుండా సుదీర్ఘంగా కొనసాగుతున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ శానిటేషన్ ఉద్యోగులు భక్తుల మనసును దోచుకున్నారు.
విధి నిర్వహణ ఒక భాగమైతే, అతివేగంగా చెత్తను సేకరిస్తూ దూరంగా తరలించడం.. ఎంత దుర్వాసన వెదజల్లినా ఓపికతో పనులు చేపట్టడం రోగాలకు తావివ్వకుండా జాతర ప్రశాంతంగా జరిగింది.