మేడారంకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి హైదరాబాద్ నుండి, కరీంనగర్, మహబూబ్ నగర్ పట్టణాల నుండి హెలికాప్టర్ లో మేడారంకు వెళ్లే పర్యాటకుల కోసం అందించే సేవలపై రూపొందించిన బ్రోచరును అవిష్కరించారు.
అనంతరం మేడారం వెళ్లే హెలికాప్టర్ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టూరిజం ఎండీ మనోహర్, రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
మేడారంకు హెలికాప్టర్ లో వెళ్లేందుకు పర్యాటకులు 09880505905 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలని సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మధ్య తరగతి ప్రజలకు నామమాత్రపు ధరతో జాలి రైడ్ ప్యాకేజీని రూపొందించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజంను రాష్ట్రంలో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
మేడారంకు హెలికాప్టర్ సేవలు: తేదీ: 14 ఫిబ్రవరి 2022 నుండి 20 ఫిబ్రవరి 2022 వరకు అందించనున్నారు.
హెలికాప్టర్ జాయ్ రైడ్: 7,8 నిమిషాలు మేడారం నుండి మేడారం జాతర వ్యూ కోసం ఒక్క వ్యక్తికి రూ.3700/ - ఛార్జ్.
మేడారం షటిల్ సర్వీస్: రైడ్ 20 నిమిషాల వన్ వే హన్మకొండ నుండి మేడారం షటిల్ సర్వీస్ ఒక్క వ్యక్తి కి రూ.19,999/-
హెలికాప్టర్ చార్టర్ సర్వీస్:
- కరీంనగర్ నుంచి మేడారం రూ.75,000/- ప్రతి వ్యక్తికి
- హైదరాబాద్ నుండి మేడారంకు ప్రతి వ్యక్తికి రూ.75,000/-
- మహబూబ్ నగర్ నుండి మేడారంకు ప్రతి వ్యక్తికి రూ.1,00,000/- గా నిర్ణయించారు.