బస్సు ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Related image

  • ఆర్టీసీ.. మీ బస్సు.. మాబస్సు.. మనందరి బస్సు
  • ఆర్టీసీ బస్సులకు ప్రయివేటు క్యాబ్ లను అనుసంధానించే ప్రయత్నం
  • సిబ్బంది పనితీరుపైనే సంస్థ మనుగడ
  • మా బస్సుల్లో ప్రయాణించండి.. మా సంస్థను ప్రోత్సహించండి
(టీ-శాట్ – సాఫ్ట్ నెట్): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ బస్సులో ప్రయాణించి సంస్థను ప్రోత్సహిస్తూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన ఆర్టీసీలో ప్రయాణికులను చేరవేడం సామాజిక భాద్యతగా స్వీకరించామన్నారు. ఆర్టీసీ బస్సు.. మీది.. మాది.. మనందరిదీ అని గుర్తు చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టీ-శాట్ స్టూడియోలో గురువారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన సజ్జనార్ ప్రజల ప్రశ్నలకు సమాధానమిస్తూ సంస్థ భవిష్యత్ కార్యాచరణ వివరించారు. ప్రతి రోజు 37 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తూ సేవలందిస్తున్నామని, ఇటీవలి కాలంలో 2250 బస్సులను పునరుద్దరించడంతో పాటు 850 కొత్త సర్వీసులను విడుదల చేశామన్నారు.

కరోనా మహహ్మారి నుండి బయటిపడి ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నని ఎండీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే మూడు వందల ఎలక్ట్రిక్ బస్సులు నడిపే ఆలోచన చేస్తున్నామన్నారు. ముఖాముఖి సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సజ్జనార్ సమాధానమిస్తూ ఆర్టీసీ బస్సుల అలైటింగ్ పాయింట్ల వద్ద ప్రయివేటు క్యాబ్ లను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.

ఆర్టీసీ ఛార్టీలు పెంపు నిర్ణయం ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉందని, త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్నారు. సామాన్య ప్రయాణికుడిపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఏ సంస్థ మనుగడ అయినా సిబ్బంది పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని, ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం అనేక ప్రత్యేక నిర్ణయాలు చేపట్టామన్నారు.

More Press Releases