ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

Related image

ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం అన్నారు.

భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

చిత్రకారుడు, జర్నలిస్టు భరత్ భూషణ్ మృతికి అల్లం నారాయణ సంతాపం:
భరత్ భూషణ్ తెలంగాణ అస్తిత్వ విలువలు కలిగిన ఒక ఫోటో గ్రాఫర్ ఆయన మరణం ఫోటో గ్రఫీకి, తెలంగాణ ధోరణలకి తీరని లోటు, బతుకమ్మ, తెలంగాణ పల్లె థీమ్ గా ఆయన ఫోటో గ్రఫీని అత్యున్నత ఫోటోలుగా భావించవచ్చు. చిత్రకారుడిగా నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి, చివరిగా అనారోగ్యం పాలైనా, తన వ్యావృత్తిని కాపాడుకుంటూ భరత్ భూషణ్ మేటిగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

మీడయా అకాడమి కూడా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థిక సాయం చేసినా కూడా కాపాడుకోలేక పోయింది. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

KCR
Telangana

More Press Releases