రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి: సునీతా లక్ష్మారెడ్డి

Related image

హైదరాబాద్: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా.. ప్రజాస్వామ్య పరిరక్షణే ద్యేయంగా నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మహిళ కమీషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బుధవారం మహిళ కమీషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి జాతీయ పతాకావిష్క‌ర‌ణ చేసి గౌర‌వ వంద‌నం చేశారు. ఈ సందర్భంగా భార‌త స్వాతంత్రోద్యమంలో, న‌వ భార‌త నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకొని వారి చిత్ర‌ప‌టాల‌కు పూలదండ‌లు వేసి నివాళులు అర్పించారు.

భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు కల్పించిందని ఆ హక్కులను వినియోగించుకోవాలని కోరారు. మహిళలకు ఏ సమస్య వచ్చిన తక్షణమే మహిళా కమిషన్ ను ఆశ్రయించాలని అన్నారు. మహిళలకు కమిషన్ అన్ని విధాలా సహాయపడుతుందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ ఆఫ్రోజ్, సెక్రెటరీ కృష్ణ కుమారి పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sunitha Laxma Reddy
Telangana
Republic Day

More Press Releases