విజ‌య‌వాడ‌ న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో ఘ‌నంగా గణతంత్ర దినోత్సవ వేడుక‌లు

Related image

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్
  • న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • ప్ర‌తి పౌరుడు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగియుండాలి
విజ‌య‌వాడ‌: నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజల సహకారంతో గత రెండున్నర సంవత్సరాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచి, గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో అవార్డు స్వీకరించుట జరిగిందని ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో కమీషనర్ ప్రసన్న వెంకటేష్, పలువురు కార్పొరేట‌ర్లు మరియు అధికారులతో క‌లిసి తొలుత గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంత‌రం నగరపాలక సంస్థ జెండాను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఎగురవేసారు.

ఈ సంద‌ర్భంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ భారత రాజ్యాగం అన్నింటి కన్నా ఉన్నతమైనదని, దీనిని లిఖించుటలో ముఖ్య పాత్ర పోషించిన డా.బిఆర్.అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు చిరస్మరణీయులు అని, భారత దేశ పౌరునిగా మనకు గల హక్కులను భాద్యతలను పొందుపరచుట జరిగిందని ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగియుండాలి అన్నారు. కమిషనర్ హోదాలో ఈ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొనుట ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తాను నిర్వర్తించిన హోదాలో అతి ముఖ్యమైనది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పని చేయటమే అని అన్నారు.

పారిశుధ్య కార్మికుల నుండి అధికారులు మరియు ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నిలుపుట జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విపత్కర పరిస్థితులలో అహర్నిశలు సిబ్బంది చేసిన సేవలు మరువరానివని అన్నారు. రాబోవు రోజులలో కూడా అందరి సమిష్టి కృషితో విజయవాడ నగరాన్ని మరింతగా అభివృద్ది పరచుకోవాలని ఆశాభావం వ్యక్తపరచినారు. అనంత‌రం న‌గ‌ర పాల‌క సంస్థ నందు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 57 మంది అధికారులు, సిబ్బందికి కమిషనర్ ప్రశంసాపత్రములను అందించారు.

కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ‌, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, మరియు ఇతర విభాగముల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఉపాధ్యాయులు, మాచవరం టి.యం.ఆర్.సి హై స్కూల్ విద్యార్ధులు, ప్రశంసా పత్రములు పొందిన పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases