ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ: సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, జనవరి 10, 2022: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచనల మేరకు, రెవెన్యూ (CT & ఎక్సైజ్), పౌర సరఫరాలు, రవాణా, ఇంధనం, గృహ నిర్మాణం, మున్సిపల్,కార్మిక, తదితర 12 విభాగాలకు చెందిన కస్టమర్లు, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వంలోని 12 శాఖల్లోని 20 హెచ్‌ఓడీలలో 301 సంస్కరణలు ఈఓడీబీ లో భాగంగా అమలవుతున్నాయని, ఈ ప్రక్రియలను మరింత సరళీకృతం చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే, యూజర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ES&T శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Somesh Kumar
Telangana
EODB
India

More Press Releases