పర్యావరణం పట్ల బాధ్యతగా ఉంటేనే హరిత విజయవాడ సాధించగలం: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ: ప్రతి ఒక్కరు పర్యావరణం పట్ల భాద్యతగా ఉంటేనే హరిత విజయవాడ సాధించగలమని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పున్నమి హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమములో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటవలెననీ, నాటుట మాత్రమే కాకుండా ఆ మొక్క పెరుగుదలకు భాద్యత తీసుకోనవలెనని, శుభాకాంక్షలు తెలుపు వేళ ఒక మొక్కను బహుకరించుట అలవాటుగా మార్చుకొనవలెనని అన్నారు.
తదుపరి పున్నమి ఘాట్ ను అధికారులతో కలసి అక్కడ భవాని భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలిస్తూ, అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు. ఘాట్ లు వద్ద నిరంతరం సిబ్బంది విధులలో ఉంచి పరిసరాలు అన్నియు ఎప్పటికప్పడు పరిశుభ్ర పరచే విధంగా చర్యలు చేపట్టాలని మరియు భక్తులు ఎవరు వ్యర్ధములు లేదా వారు వేసుకోనిన బట్టలు నదిలో పడవేయకుండా చూడాలని ఘట్ ఇన్ ఛార్జ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం రాజీవ్ గాంధీ పార్కు నందలి ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేసి సందర్శకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్క్ నందు ఇంకను పూర్తి చేయవలసిన ఇంజనీరింగ్ మరియు గ్రీనరీ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సి.హెచ్ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్పందన ద్వారా 13 అర్జీలు స్వీకరణ:
స్పందనలో వచ్చిన అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. సొమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నతాధికారులతో కలిసి ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం - 3, పబ్లిక్ హెల్త్ విభాగం –3, రెవెన్యూ విభాగం – 4, యు.సి.డి విభాగం – 1, మొత్తం 13 అర్జీలు స్వీకరించుట జరిగింది.
Sl.No. | NAME OF THE PETITIONER, ADDRESS | SUBJECT | DEPARTMENT |
1 | J.VENKATESWARA RAO, 41-5/1-14, KRISHNA LANKA | NEIGHBOURS DRAINAGE WATER LEAKING FROM THE WALL | CMOH |
2 | P.RAMA DEVI, 41-5/1-12, GARIKAPATIVARI STREET, KRISHNA LANKA | SOUND POLLUTION AND OPEN DRAIN PROBLEM | CMOH |
3 | P.INDIRA, 44-6-22, PADAVALAREVU, GUNADALA | PROVIDING UGD CONNECTION | CE |
4 | Y.RATNAKUMAR, 59-2-3/1, RAMACHANDRA NAGAR | DOOR NUMBER CORRECTION IN PROPERTY TAX | DCR |
5 | P.ARAVIND GUPTA, 11-45-100, TAVVAVARI STREET, | INTREST DEDUCTION IN PROPERTY TAX | DCR |
6 | D.SEETARAMA RAJU, 42-3-38/1A, RAMAKRISHNA PURAM | NEIGHBOURS UNAUTHORISED CONSTRUCTION | CP |
7 | V.CHANDRAVATHI, 9-51-15, KOTHAPET | ISSUING OF UGD AMOUNT PAID DUPLICATE RECEIPT | CE |
8 | V.V.SATYANARAYANA, 18-4-24A, KEDARESWARAPET | CALICULATION OF LAND VALUE OF ROAD WIDENED SITE | CP |
9 | H.VENKATA SIVA PRASAD, 38-8-65, M.G.ROAD | TDR BOND ONLINE | CP |
10 | B.SRINIVASA RAO, 1-3/8-13, VIDYADHARAPURAM | NAME CHANGE IN HOUSE TAX | DCR |
11 | T.SWAMY, 76-16-149, BHAVANIPURAM | PROVIDING CIVIC EMINITIES AND HANDING OVER OF FLAT | UCD |
12 | A.SAROJA DEVI, 297-19-14, GOVERNORPET | DEDUCTION OF VACANT LAND PENALITY | DCR |
13 | U.SATYAVATHI, MIG:53, OLD HOUSING BOARD COLONY | APPLIED FOR RETIREMENT BENEFITS | CMOH |
కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్. ఇ నరశింహరావు, ఎస్టేట్ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 8 అర్జీలు:
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో 2 అర్జీలు, పట్టణ ప్రణాళిక విభాగం – 1, యు.సి.డి విభాగం -1, సర్కిల్ - 2 కార్యాలయంలో 3 అర్జీలు, పట్టణ ప్రణాళిక విభాగం – 1, ఎడ్యుకేషన్ విభాగం -1, ఇంజనీర్ విభాగం-1, సర్కిల్ – 3 కార్యాలయంలో 3 అర్జీలు రాగా ఇంజనీరింగ్ విభాగం -1, పట్టణ ప్రణాళిక విభాగం –1 మరియు రెవిన్యూ విభాగం – 1 మొత్తం సర్కిల్ కార్యాలయాల్లో 8 అర్జీలు అందించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.