317 జీవో అమలు తీరుపై రంగా రెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, డిసెంబర్ 16: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్ 317 అమలు తీరు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టడం పట్ల సీఎస్ జిల్లా కలెక్టర్ ను అభినందించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాగా, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కోరగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని సీఎస్ సోమేశ్ కుమార్ వారికి హామీ నిచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, తిరుపతి రావులు కూడా ఉన్నారు. 

Somesh Kumar
Telangana

More Press Releases