నగరాన్ని సుస్థిరంగా అభివృద్ధి పరచే దిశగా చర్యలు: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
- యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రాంపై సమీక్ష
ఈ సందర్భంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని రానున్న కాలంలో మెరుగైన మౌలిక వసతులు, క్లీన్, గ్రీన్ నగరంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి విభాగం యుఎన్-హెచ్.ఏ.బి.ఐ.టి.ఏ.టి. ప్రతినిధులు గత ఏడాది కాలం నుండి నగరంలో పర్యావరణ పరిరక్షణ, ప్రధాన రహదారుల అభివృద్ది, ప్రజా రవాణా మెరుగుదల, ఫ్రాగ్మెంటెడ్ బ్లూ గ్రీన్ నెట్‌వర్క్, చిన్న చిన్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాలు మరియు సేవలకు సంబందించి పెట్టుబడికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా మౌలిక వసతులపై సమగ్ర అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం యున్ – హబిటాట్ ప్రతినిధులు సర్వే వివరాలను పవర్ పాయింట్‌ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
కార్యక్రమంలో యున్ – హబిటాట్ సీనియర్ అర్బన్ ప్లానర్స్ మాన్సీ, ఆస్థా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ స్వాతి సింగ్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదదేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
14వ డివిజన్ లో పలు సమస్యలపై అధికారులతో కలసి పర్యటన.. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్: పారిశుధ్య పనుల పరిశీలనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 14వ డివిజన్ పరిధిలోని పలు ప్రదేశాలలో పర్యటిస్తూ, డివిజన్ లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ అమలు చేయుటతో పాటుగా డ్రెయిన్స్ ద్వారా మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.దర్సిపేట కృష్ణవేణి స్కూల్ రోడ్ నందు నివాసాల నుండి సేకరించిన చెత్త మరియు వ్యర్ధముల లోడింగ్ పాయింట్ వద్ద పరిసరాలు అన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుటతో పాటుగా ప్రక్కనే గల డ్రెయిన్ నందు మురుగునీటి ప్రవాహమునకు అడ్డంగా ఏవిధమైన చెత్త లేకుండా ఉండేలా చూడాలని డివిజన్ శానిటరీ ఇన్స్ పెక్టర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతములో ఎల్ అండ్ టి వారిచే నిర్మాణం జరుగుతున్న అవుట్ ఫాల్ డ్రెయిన్ సదరు స్కూల్ రోడ్ నుండి నేరుగా నిర్మించునట్లుగా చూడాలని స్థానిక కార్పొరేటర్ చింతల సాంబశివరావు, కమిషనర్ దృష్టికి తీసుకురాగా సదరు ప్రదేశాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు.
తదుపరి డివిజన్ పరిధిలో కొండ ప్రాంతములో శివాలయం దేవస్థానమునకు భక్తులు వెళ్ళుటకు సరైన మార్గం లేనికారణంగా మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నుండి చిన్న మార్గం ఏర్పాటు చేసినట్లయితే దానికి అగు వ్యయం స్థానికులు కాంట్రిబ్యూషన్ చెల్లించుట జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ కమిషనర్ కు వివరించారు.
సదరు స్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి రహదారి ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల నందలి విద్యార్ధులతో వారి యొక్క సిలబస్ మరియు సబ్జెక్టు నందలి పలు ప్రశ్నలకు జవాబులను అడిగితెలుసుకొన్నారు. అదే విధంగా తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లు కూడా విద్యార్ధులు తెలుసుకొని యుండాలని సూచించారు.
పర్యటనలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు ప్రజారోగ్య శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.