'హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్' ను ఆవిష్కరించిన అల్లం నారాయణ

Related image

హైదరాబాద్ నగరంపై చెరగని ముద్రవేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రదర్శన తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

సోమవారం మీడియా అకాడమి కార్యాలయంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ తర్వాత పుస్తక ప్రదర్శనకు లక్షలాది మంది రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందన్నారు. కవులు, రచయితలు, సామాజిక వేత్తలు, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారికి ఇది ఉపయుక్తకరమన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరి శంకర్, కార్యదర్శి చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15న ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ:
కోవిడ్ 19 తోపాటు అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నెల 15వ తేదీన ఆర్థిక సహాయం అందించే చెక్కుల పంపిణీని చేస్తున్నట్టు మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్ రావు తెలిపారు. డిసెంబర్ 15న ఉదయం 11.30 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ లో ఉన్న మీడియా అకాడమీ కార్యాలయంలో నిర్వహించే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్ తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్బంగా అనారోగ్యంతో పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందచేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad
Telangana

More Press Releases