కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 2 లక్షలు.. ఈ నెల 15న చెక్కుల పంపిణీ

Related image

హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమి తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్ 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.  కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

అట్లాగే మార్చి నుండి డిసెంబర్, 6వ తేదీ వరకు 7 నెలల కాలంలో ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు.

Corona Virus
Hyderabad
Telangana

More Press Releases