సమస్యల సత్వర పరిష్కార వేదిక 'స్పందన': విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అదనపు కమిషనర్ (జనరల్), శాఖాధీపతులతో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో నగరపాలక సంస్థకు సంబందించి పలు సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
సదరు సమస్యలకు సంబంధించి అక్కడిక్కడే పరిష్కార దిశగా చర్యలు తీసుకొనినారు మొత్తము ప్రజల నుంచి వచ్చిన 20 అర్జీలు పరిశీలించి ప్రజలు తెలిపిన సమస్యలపై తీసుకొనిన చర్యల వివరాలతో రిపోర్ట్ సమర్పించవలసినదిగా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కొను ఇబ్బందులను అధికారులు క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగమును – 4, పట్టణ ప్రణాళిక విభాగం - 5, రెవెన్యూ విభాగం - 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 2, యు.సి.డి విభాగం – 7, ఎస్టేట్ విభాగం – 1 మొత్తం 20 అర్జీలు స్వీకరించుట జరిగినది.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) జె.అరుణ, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు అందరు శాఖాధీపతులు పాల్గొన్నారు.
జోనల్ కమిషనర్ల ఆద్వర్యంలో సర్కిల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం సంబందించి - 1 అర్జీ, సర్కిల్ – 2 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం సంబందించి – 3, పబ్లిక్ హెల్త్ విభాగం – 3, ఎ.డి.హెచ్ విభాగం – 1 వచ్చినవి.
చక్కటి అనుభూతికి ఆహ్లాద భరిత ఉద్యానవనములు: కమిషనర్కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నేడు నగరoలోని రాజీవ్ గాంధీ పార్కును తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న ఇంజనీరింగ్ మరియు గ్రీనరి అభివృద్ది పనులను పరిశీలించారు. పార్క్ నకు వచ్చు సందర్శకులను ఆకర్షించేలా ఆహ్లాద భరిత వాతావరణములో మంచి అనుభూతి కలిగే విధంగా పార్కులను తీర్చిదిద్దవలెనని అన్నారు.
పార్కు ఆవరణ మొత్తము పరిశీలన జరిపి ఏయే ప్రాంతములలో ఏ విధమైన ఆటపరికరముల ఏర్పాటు చేయవలెనో గుర్తించి చుట్టూ విశాలముగా సౌకర్యవంతముగా ఉండునట్లు చూడవలెనని, చేపట్టిన అన్ని పనులను వేగవంతం చేసి విద్యుత్ సౌకర్యము కల్పించి ఈ మాసాంతమునకు అందుబాటులోనికి తీసుకోనిరావలేయనని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్ ని ఆదేశించారు.