భూదాన్ పోచంప‌ల్లి గ్రామానికి అంత‌ర్జాతీయ గుర్తింపు.. సీఎం కేసీఆర్ హర్షం

Related image

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని ‘భూదాన్ పోచంప‌ల్లి’కి ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

ఐక్య‌రాజ్య స‌మితి అనుబంధ ప్ర‌పంచ ప‌ర్యాట‌క సంస్థ‌, భూదాన్ పోచంప‌ల్లిని ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమని సీఎం అన్నారు.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని సీఎం తెలిపారు.

pochampally
Yadadri Bhuvanagiri District
Telangana
UNWTO

More Press Releases