ప్రవాస భారతీయ నాయకుల మధ్య దీపావళి వేడుకల్లో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ దంపతులు

Related image

డల్లాస్, టెక్సాస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తన సతీమణి సిస్లియా తో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో ప్రవాస భారతీయ నాయకుల మధ్య దీపావళి వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. గవర్నర్ దంపతులు దీపావళి సంకేతంగా పలు దీపాలను వెలిగించి, అందరికీ విందుభోజనం తో పాటు మిటాయిలు పంచి ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ అబ్బాట్ మాట్లాడుతూ అమెరికా దేశ ప్రగతిలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్ర పురోభివృద్ధికి వివిధ రంగాలలో ప్రవాస భారతీయులు చూపుతున్న ప్రతిభ అనన్యసామాన్యం అన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం తన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడిని కలుసుకోవడం తనకొక ఒక ప్రత్యేక అనుభూతి అని, భారత దేశం టెక్సాస్ రాష్ట్రాల మధ్య ఇప్పటికే గణనీయమైన వాణిజ్య సంభందాలున్నాయని, భవిష్యత్ లో అవి ఇంకా పెరగడానికి కృత నిశ్చయంతో ఉన్నామని గవర్నర్ వెల్లడించారు.

అనేక సంవత్సరాలగా భారత దేశం టెక్సాస్ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక, వాణిజ్య సంభందాలు మెరుగు పర్చడంలో గవర్నర్ చేస్తున్న కృషికి, భారతీయులకు అతి ముఖ్యమైన దీపావళి పండుగను తన కుటుంబం తో కలసి తన నివాస గృహంలో ప్రవాస భారతీయల మధ్య జరుపుకున్నందులకు అందరి తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ అగర్వాల్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలసి డా. ప్రసాద్ తోటకూర, అరుణ్ అగర్వాల్, మురళి వెన్నం, సుధాకర్ పేరం, వినోద్ ఉప్పు, సంజయ్ సింఘానియా, డా. గూడూరు రమణా రెడ్డి, గొట్టిపాటి వెంకట్, సునీల్ రెడ్డి, వెంకట్ మేడిచెర్ల, బంగారు రెడ్డి, సునీల్ మైని, ఎ కె మాగో, పియూష్ పటేల్ లు పాల్గొన్నారు.

ఫోటోలు ఇవిగో 
https://drive.google.com/drive/folders/1QUj4uL1HsOPqNnYuyQ6sIf0nCDihXVyz


Prasad Thotakura
Diwali
Greg Abbott
USA
NRI
Murali Vennam
Sudhakar peram

More Press Releases