స్పందనలో 25 అర్జీలు స్వీకరణ - సమస్యల పరిష్కారానికి చర్యలు

Related image

  • ప్రధాన కార్యాలయాలలో 13 అర్జీలు స్వీకరణ
  • సర్కిల్ కార్యాలయాలలో 12 అర్జీలు స్వీకరణ
విజయవాడ: న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్ర‌ధాన కార్యాల‌యంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ వివిధ విభాగముల అధికారులతో కలసి స్పందన కార్యక్రమము నిర్వహించి అర్జీదారుల నుండి 21 అర్జీల‌ను స్వీక‌రించారు.

ప్రజలు సమర్పించిన సమస్యలను అర్జీలు పరిశీలించి, అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ – 1, పట్టణ ప్రణాళిక - 6 పబ్లిక్ హెల్త్ – 4, యు.సి.డి విభాగం – 2 మొత్తం13 అర్జీలు స్వీక‌రించుట జరిగింది.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నరు.

మూడు సర్కిల్ కార్యాలయాలలో 12 అర్జీలు స్వీకరించిన జోనల్ కమిషనర్లు:

సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంనకు సంబందించి 2 అర్జీలు, సర్కిల్ – 2 నందు  ఇంజనీరింగ్ -2, రెవిన్యూ-2, యు.సి.డి-1 మొత్తం 5 అర్జీలు మరియు సర్కిల్ – 3 నందు ఇంజనీరింగ్ -3, పబ్లిక్ హెల్త్ -1 మరియు పట్టణ ప్రణాళికా – 1 మొత్తం 5 అర్జీలు, మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో 12 మంది వారి వారి సమస్యల అర్జిలను జోనల్ కమిషనర్లకు అందించారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధనకై  పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని స్మరించుకోవాలి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి నవంబరు - 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ 37వ డివిజన్ సామరంగ్ చౌక్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు కార్పొరేటర్లతో కలసి పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పిస్తూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ అయన ఆశయాలను గుర్తుచేసుకోవలసిన ఆవశ్యకత అందరిపై ఉందని పేర్కొన్నారు.

More Press Releases