తెలంగాణ సీఎస్ ను కలిసిన యూఎస్ కాన్సులేట్ జనరల్!

Related image

విద్య, వైద్య, ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలలో సహకారం అందించుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి అన్నారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్‌ రిఫ్‌ మాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు సాగు నీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.

మంచి వాతావరణంలో గుడ్ ఈకో సిస్టంలతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని అమెరికా, భారత్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని అన్నారు. విద్యార్ధుల సమస్యలు ఏమైనా ఏర్పడినపుడు వెంటనే స్పందించాలన్నారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ మాట్లాడుతూ తెలంగాణ, అమెరికాల స్నేహ పూర్వక మైత్రి మరింత పెంపొందించేలా కృషి చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, యూఎస్ కాన్సులేట్ బిల్డింగ్ నిర్మాణం పరిస్ధితిపై చర్చించారు.

More Press Releases