హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహానేత
  • నిత్యం బీద ప్రజల కొరకు పరితపించిన మహామనిషి
  • హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో దివంగత నాయిని సంస్మరణ సభ
  • హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న దేవరకొండ శాసనసభ్యుడు రవీంద్ర నాయక్ తదితరులు
హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తు చేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని లోయర్  ట్యాంక్ బండ్ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దివంగత నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం బీద ప్రజల అభ్యున్నతికి కొరకై పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని ఆయన కొనియాడారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యుడు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

nayini
G Jagadish Reddy
Hyderabad

More Press Releases