తెలంగాణ అసెంబ్లీ లాంజ్ లో పీవీ తైలవర్ణ చిత్రపటం ఆవిష్కరణ

Related image

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు, శుక్రవారం అసెంబ్లీ లాంజ్ లో పీవీ తైలవర్ణ చిత్రపటాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో, మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, కమిటీ సభ్యులు, శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పీవీ కూతురు వాణి దేవి, పీవీ కుటుంబ సభ్యులు, కెవి రమణాచారి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana
KCR
Hyderabad
PV Narasimharao

More Press Releases