దసరా ఉత్సవాలలో విధులు నిర్వహించు సచివాలయం సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి: వీఎంసీ కమిషనర్

Related image

విజయవాడ: దసరా ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చు భక్తులు / యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ, ప్రతి ఒక్కరు విధిగా  కోవిడ్ నియమాలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు దసరా ఉత్సవాలలో విధులు నిర్వహిస్తున్న వార్డ్ హెల్త్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ, వార్డ్ వాలెంటర్సీ లతో కమిషనర్ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా దసరా ఉత్సవాలలో విధులు నిర్వహించు కార్యదర్శిలు మీకు కేటాయించిన విధులలో బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. క్యూ లైన్లు, కేశఖoడ, మరుగుదొడ్లు మొదలగు అన్ని ముఖ్యమైన చోట్ల ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ లు ధరించేలా చూడాలని మరియు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అదే విధంగా ప్రజలందరూ విధిగా కోవిడ్ నియమాలు పాటిస్తూ, క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకొనేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

దసరా ఉత్సవాలను పురష్కారించుకొని ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు, క్యూ లైన్ లు మరియు పరిసరాలు అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చూడవలసిన బాధ్యత మీపై ఉందని, ప్రజలకు అన్ని సదుపాయాలు, క్లోక్ రూమ్, చెప్పల స్టాండ్ మరియు హెల్త్ క్యాంప్ మొదలగునవి అందుబాటులో ఉంచాలని అన్నారు.

తదుపరి తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నందు జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, పనులు వేగవంతముగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దసరా ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ ద్వారా నగర అందాలు విక్షించేటలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందలి హెలిప్యాడ్ ఏర్పాటు పనులు పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు.

సమావేశంలో చీఫ్ ఇంజనీరు యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases