సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి!

Related image

  • సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

  • బోన‌స్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హర్షం

  • కార్మికుల త‌ర‌పున సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా, దీపావ‌ళి పండుగను పుర‌స్క‌రించుకుని బోన‌స్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సింగేరేణి కార్మికుల త‌ర‌పున మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావుకు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్రతీ కార్మికునికి రూ. 1,00,899 బోనస్ ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని సీఎం చాటుకున్నారన్నారు. గతేడాదికన్నా రూ.40,530 అదనంగా బోనస్ పెంచారని కొనియాడారు. సింగరేణి కార్మికులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తూ వారి సమస్యల పట్ల అనునిత్యం స్పందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతం అయిందన్నారు.

KCR
dasara
indrakaran reddy
TRS
Telangana

More Press Releases