సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: సీఎం కేసీఆర్

Related image

సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ను సీఎం ఆదేశించారు.

అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి బుధవారం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, దివాకర్ రావు, వనమా వెంకటేశ్వర్లు, దుర్గం చిన్నయ్య, సండ్ర వెంకట వీరయ్య, రేగ కాంతారావు, హరిప్రియ, కోరుకంటి చందర్, సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులతో సమావేశమయ్యారు.

సింగరేణి ప్రాంతంలోని సమస్యలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది మాదిరిగానే 2018-19 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించే అంశాన్ని ప్రకటిస్తానని సీఎం హామీ ఇచ్చారు.

Singareni
workers
KCR
Hyderabad
Telangana

More Press Releases