విద్యార్థులకు అత్యున్నత సౌకర్యాలు కల్పిస్తాం: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
- శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్ ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విద్యార్ధులను ఉద్దేశించి మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్ధికి అత్యున్నతమైన సౌకర్యాలు కలిపించడం జరుగుతుందని, ఈ పాఠశాలలో 10వ తరగతిలో మంచి ప్రతిభ కనబరచిన బాలబాలికలకు హాస్పిటల్ మానేజ్మెంట్ వారిచే నగదు బహుమతి అందించడం హర్షనీయమని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులందరికీ మంచి క్రమ శిక్షణ, మంచి పరిశుభ్రత యందు శిక్షణ అందించుచున్నారని తెలిపారు.
డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ.. పాఠశాలలో ఎటువంటి అవసరము ఉన్న ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అదే విధంగా రాబోవు రోజులలో మరిన్ని పాఠశాలలో ఈ శానిటరీ వెండింగ్ ఏర్పాటు చేయుటకు సిద్దంగా ఉన్నామని, విద్య వైద్యం నందు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి ముందు ఉంటామని హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కె.గోపాల కృష్ణ, చైర్మన్ వై.రమేష్ బాబు పేర్కొన్నారు.
కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వి. రవికుమార్, స్కూల్ సూపర్ వైజర్లు కె.రాజశేఖర్, షేక్ సైదా సాహెబ్, పాఠశాల ఉపాధ్యాయులు, విధ్యార్దులు పాల్గొన్నారు.