భారతదేశానికి దశ, దిశ కేసీఆర్ దళిత బంధు: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • దళిత బంధు మరో విప్లవం
  • గాంధీ, అంబెడ్కర్ ల కలల సాకారం
  • సామాజిక అంతరాలను తొలగించాలి అన్నదే సంకల్పం
  • దళిత బంధుకు శ్రీకారం చుట్టింది 1985 లోనే
  • తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరిలో దళితబంధుపై అవగాహన సదస్సు
దళితబంధు పథకం మరో విప్లవం సృష్టించబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి అద్భుతమైన పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టింది 1985 లోనేనని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పురపాలక సంఘము పరిధిలో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన దళితబంధుపై అవగాహన సదస్సుకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక అంతరాలను తొలగించి దళితులను ఆర్థికంగా బలోపేతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ ల కలల సాకారమే దళిత బంధు లక్ష్యం మని ఆయన చెప్పారు. అటువంటి విప్లవాత్మక మైన పథకానికి బీజం పడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటి సారిగా శాసనసభ్యుడిగా చట్ట సభలో అడుగుపెట్టిన 1985 సంవత్సరంలో నేనని ఆయన వెల్లడించారు. పరిపాలకుడిగా అవకాశం రావడంతో సమాజంలో అంతరాలు తొలగించడం కోసమే ఆయన పరితపన అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నికల కోసమో.. ఎన్నికల్లో లబ్ది పొందేందుకో ఉద్దేశించబడినది ఎంతమాత్రం కాదన్నారు. ఏడున్నర వేల కోట్లతో మొదలైన రైతుబంధు పథకం 15 వేల కోట్లకు చేరినా కొనసాగించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా రైతుభిమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. ఆ క్రమంలో మొదలు పెట్టిన దళిత బంధు పథకం తో సామాజిక అంతరాలు తొలగించడం తో పాటు అట్టడుగున ఉన్న దళిత వర్గాలను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రారంభించారని ఆయన అన్నారు. అటువంటి దళితబంధు పథకం నిరంతర ప్రక్రియ అని ఏ ఒక్కరికి ఇందులో సందేహ పడాల్సిన అవసరం లేదన్నారు.

రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మాగాంధీ మార్గంలో తెలంగాణ సాధించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. భారతదేశం తో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు అదే స్వాతంత్ర్యం సిద్దించినా అనతి కాలంలోనే ఆయా దేశాలు కుప్ప కూలి పోయాయి అని, భారతదేశంలో ఇప్పటికి సుస్థిరమయిన ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నది అంటే అందుకు కారణం బాబాసాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనమేనన్నారు. అందుకే ఆ ఇద్దరి కలల సాకారం చేస్తూ యావత్ భారతదేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు వంటి విప్లవాత్మకమైన పథకానికి అంకురార్పణ చుట్టారన్నారు.
 
స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులోజిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజని రాజశేఖర్, వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి,యంపిపి యన్.స్నేహాలత,జడ్పిటిసి అంజలి రవీందర్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ హేమంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

G Jagadish Reddy
KCR
Telangana

More Press Releases