ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికై రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబే కాలనీ ఎఫ్.బ్లాక్ లో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, వైఎస్సార్ సీపీ డివిజన్ కో-ఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి పర్యటించారు.
గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పింఛన్ తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా తెలియజేశారన్నారు. వాంబే కాలనీలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి త్వరలోనే స్థానిక కమ్యూనిటీ హాల్లో రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని మల్లాది విష్ణు తెలియజేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నాని, ఇస్మాయిల్, బత్తుల దుర్గారావు, బలగ శ్రీను, హనుమంతు, దుర్గారావు, సుభానీ, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.