రాజీవ్ గాంధీ పార్క్ నందలి ఆధునికీకరణ పనులు వేగవంతము చేయాలి:వీఎంసీ కమిషనర్
- దసరా నాటికీ పూర్తి స్థాయిలో సందర్శకులకు అందుబాటులో
పార్క్ ఆవరణలో పి.పి పద్దతిలో చిన్నారుల కోసం మల్టీ ప్టే గ్రేమ్స్, పిల్లల పార్క్ మొదలగు పనులు వెంటనే చేపటి పూర్తి చేయాలని, ఓపెన్ మ్యూజిక్ ఫౌంటెన్, వంతెన, టాయిలెట్స్ మొదలగు వాటికీ తగిన మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్క్ నందలి అని పనులు చేపట్టి యుద్దప్రాతిపదికన పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో పార్క్ ప్రారంభించుటకు సిద్దంగా ఉంచి దసరా నాటికీ పూర్తి స్థాయిలో సందర్శకులకు పార్క్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి.వి.కె భాస్కరరావు, ఉద్యానవన శాఖాదికారి జె.జ్యోతి మరియు డిప్యూటీ ఇంజనీర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.