అటవీ అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 11: సమాజానికి, ప్రకృతికి మేలు చేకూర్చే అటవీ సంపదను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమరులకు ఘనంగా నివాళులర్పించారు. జూ పార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం సభలో ప్రసంగిస్తూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారన్నారు. ముఖ్యంగా అటవీ సంపదను కాపాడటంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అటవీ సంపదను దోచుకునే దొంగలు, మాఫియా ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధాపోవన్నారు. వారి త్యాగలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.
కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం తలెత్తిన తొలి రోజుల్లో సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక ప్రపంచం యావత్తూ విస్మయం చెందిందని పేర్కొన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటవీ సంపదను కాపాడడంలో సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. అటవీ సంపదను దోచుకునే దొంగలు, మాఫియా ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధాపోవని, వారి త్యాగలనే ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు.
అటవీ సంపదను కాపాడడానికి అటవీ అధికారులు నిరంతరం సేవలు అందిస్తున్నారని వారి రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, పీసీసీఎఫ్ లు దొబ్రియల్, లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, FDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి ప్రసంగం:
- అడవుల సంరక్షణలో భాగంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి సేవలు ఎల్లప్పుడు గుర్తుంటాయి. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులకు వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
- విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులను స్మరించుకోవడానికి, వారిని స్పూర్తిగా తీసుకోవడానికి ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఆనవాయితీగా జరుపుకుంటున్నాము.
- రాజస్థాన్‌లో అడవులను రక్షించడంలో 363 మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు. వారి త్యాగాలకు గుర్తుగా దేశంలో సెప్టెంబరు 11న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాము. రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీ సిబ్బంది... దుండగుల చేతిలో వీరమరణం పొందారు.
- అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో చర్యలు చేపట్టడం జరుగుతుంది.
- జంగిల్ బచావో- జంగిల్ బడావో అనే నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణ మరియు క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కొరకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం గౌరవన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పోలీసు శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో అడవుల రక్షణ మరియు స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు తీసుకుంటున్నాము. కలప అక్రమ రవాణా అరికట్టడానికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకోవడం జరుగుతుంది.
- ఇక అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామకాలను చేపట్టింది. ఇప్పటి వరకు 90 FSO's 67 FROs, 1857 FBO's ఉద్యోగాలకు నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు
- 53 FROs, 1261 FBO's, 76 FSO's విధుల్లో చేరారు. అంతేకాకుండా అటవీ అధికారులు, సిబ్బందికి 2173 వాహనాలను అందజేశారు.
- అటవీ పునరుజ్జీవనం: 2020-21 సంవత్సరం లో 9,052,840 హెక్టార్లలో ప్లాంటేషన్ చేపట్టబడ్డాయి. పునరుజ్జీవన ప్రణాళిక ప్రకారం వివిధ అటవీ కార్యకలాపాల కోసం రూ.378.448 కోట్లు వెచ్చించారు.
- అడవి సరిహద్దులను సరి చూసుకుని పశువులను నియంత్రించే కందకాలను 10,703 కీ. మీ పొడవున రవి దీనిపై గచ్చకాయ మొక్కలు నాటడం ద్వారా అడవి సంరక్షణ కు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- అడవులలో గడ్డి భూములు నీటి వనరులు అభివృద్ధి పరచుట ద్వారా పంట పొలాలు పశువులపై దాడులను అరికడుతున్నారు.
- ప్రపంచంలోనే పచ్చదనం పెంపుదల లో మూడవ అ అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం పథకం రాష్ట్రంలో 232 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటివరకు నాటడం జరిగింది.
- ప్రతి గ్రామపంచాయతీలో మొక్కల పెంపక కేంద్రము ఏర్పాటు చేస్తున్నాం.
- i) తెలంగాణ హరితహారం పథకంలో ఇప్పటివరకు 15,241 నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో గ్రామ పంచాయతీలలో 13,601 మున్సిపాలిటీలలో 1640 నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది.
- ii) రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించుటకు క్షీణించిన అడవుల్లో అటవీ పునరుద్ధరణ పనులను అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది.
- iii) తెలంగాణకు హరితహారం పథకంలో 2019 & 2020 సంవత్సరంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖల ద్వారా నాటిన మొక్కలను బ్రతికిన మొక్కల వివరాలను సెప్టెంబర్ 1, 2021 నుండి 15 సెప్టెంబర్ 2021 అటవీ శాఖ ద్వారా సేకరించడం జరుగుతుంది.
- అటవీ సంపదను కాపాడాలనే లక్ష్యంతో అటవీ నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణలు చేసి నేరగాళ్ళపై పీడీ యాక్టు క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ సహకారంతో ఇప్పటి వరకు పీడీ యాక్టు క్రింద కేసులు నమోదు చేయడం జరిగింది.
- నూతన పంచాయతీ, మున్సిపల్ చట్టాల ద్వారా నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు కఠినమైన నిబంధనలు పొందుపరిచడం జరిగింది. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను ఖచ్చితంగా సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాము.
- ప్రకృతి పరంగా లభించిన సహజ వనరులను కాపాడుకోవడంతో అభివృద్ది పరచడం మనందరి బాధ్యత. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడడం కోసం విధి నిర్వహణలో అశువులు బాసిన అటవీ సిబ్బంది యొక్క అంకితం భావం చిరస్మరణీయం, స్పూర్తిదాయకం.