గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తాం: సీఎం జగన్

Related image

స్పందన కార్యక్రమంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలని, మరింత మానవీయ దృక్పథంతో స్పందన వినతులకు పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తిచేసి డిసెంబర్ నుండి కొత్త రేషన్‌కార్డులు,పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి జ‌గ‌న్ అన్నారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో సీఎం మాట్లాడుతూ స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌న్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ సమస్యను అధిగమించవ‌చ్చ‌ని సీఎం అన్నారు.

సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌లు నడుపుకుంటున్నవారికి ఏడాదికి రూ.10వేల పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దరఖాస్తులు తీసుకోవడం, వాటికి తనిఖీలు, ఆమోదంపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. కర్నూలు, కడప, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ‌న్న స‌మాచారం వ‌స్తోంద‌ని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

More Press Releases