స్పందనకు ప్రజల నుంచి విశేష స్పందన
విజయవాడ: ఫిర్యాదుదారులు సమస్యకు నగర పాలక సంస్థ పరిధిలో తగు విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తాస్తున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్, అధికారులతో కలిసి మేయర్ బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు.
స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 2, ఇంజనీరింగ్ – 4, పట్టణ ప్రణాళిక -8, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -1, పబ్లిక్ హెల్త్ – 3, యు.సి.డి విభాగం – 4 మొత్తం 22 అర్జీలు స్వీకరించిన్నట్లు వివరించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎస్.ఇ. నరశింహ మూర్తి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ తదితరులు ఉన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన
సర్కిల్ – 1 కార్యాలయంలో – 2 అర్జీలు రెవిన్యూ -1, యు.సి.డి విభాగమునకు సంబందించి-1,
సర్కిల్ – 2 కార్యాలయంలో – 2 అర్జీలు ఇంజనీరింగ్ -1, రెవిన్యూ విభాగమునకు సంబందించి-1
సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగమునకు సంబందించి-1
ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.
మేయర్ అద్యక్షతన స్థాయీ సంఘ సాధారణ సమావేశము:విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగినది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, తదితరులు సమావేశంలో ఉన్నారు.
సదరు సమావేశంలో 24 అంశాలపై చర్చించి 17 అంశాలను ఆమోదిస్తూ, 3 అంశాలు వాయిదా, 1 అంశము పరిశీలన నిమిత్తం వాయిదా వేయటo జరిగింది. పరిపాలన పరమైన అంశాలకు సంబందించి 1 అంశమును ధ్రువీకరించుట మరియు 2 అంశాలను ర్యాటి మరియు రికార్డు చేయుటం జరిగింది.