యంకె బేగ్ స్కూల్ లో మధ్యాహ్నం భోజనం చేసిన వీఎంసీ కమిషనర్
- నాడు నేడు పనుల ద్వారా స్కూల్స్ అభివృద్ధి
- ఎమ్మెల్సీ ఎం.డీ కరీమున్నిస్సాతో కలిసి పర్యటించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్
బుధవారం ఎమ్మెల్సీ కరిమునీస్సా నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ 59వ డివిన్‌లో పలు ప్రాంతాలలో పర్యటించారు. పైపుల రోడ్డులో రహదారిపై వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు. సింగ్ నగర్ రైతు జజార్, పాయకాపురం తదితర ప్రాంతాలను పర్యటించిన కమిషనర్ మాట్లాడుతూ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం ఆధునీకరణ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో షాపులు నిర్మాణంపై అంచనాలు రూపాందించాలని, అదే విధంగా రైతు బజారు ప్రధాన ద్వారం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్సీ కరిమునీస్సాతో కలిసి కమిషనర్ యంకె బేగ్ నగరపాలక సంస్థ హైస్కూల్ ఆవరణలో మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులకు ఇస్తున్న భోజనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంకె బేగ్ నగరపాలక సంస్థ హైస్కూల్ ఆవరణలో నీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఖాళీ స్థలంను చదును చేయాలన్నారు. ఎమ్మెల్సీ కరిమునీస్సా మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంపై ప్రత్యేక శ్రద్దతో నిధులు కెటాయించడంతో విజయవాడ నగర అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు.
కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ షహీనా సుల్తానా, 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రూహుల్లా, వైసీపీ శ్రేణులు ఉన్నారు.
UPSC Test Series పోస్టర్ ను ఆవిష్కరించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతూ రానున్న అక్టోబర్ నెల 10వ తారీఖున UPSC-2021 ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన UPSC Test Series కు సంబందించిన పోస్టర్ ను కమీషనర్ ప్రసన్న వెంకటేష్ విడుదల చేశారు. ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు U.P.S.C Test Series ఉచితంగా అందిస్తున్నట్లు విద్యాదర్శిని ఐ .ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ విజయ కుమార్ తెలిపారు.
మాక్ టెస్ట్ సిరీస్ ప్రతి శని, ఆదివారము విద్యాదర్శిని ఐ .ఎ.ఎస్ అకాడమి ప్రాంగణములో ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు జరుగుతాయి. తదుపరి మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 6:00 వరకు ప్రశ్నాపత్రల Explanation అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఇవ్వబడుతుంది అని వివరించారు. ఆసక్తి కలిగిన ఆభ్యర్డులు ఈ సదవకాశమును స్వదినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలియచేశారు.