నులిపురుగుల నివారణతో ఆరోగ్యవంతమైన జీవితం: విజయవాడ మేయర్
విజయవాడ: ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం అని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరముందని నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
మంగళవారం జాతీయ నులిపురుగుల (డి-వార్మింగ్) నిర్మూలన దినోత్సవమును పురస్కరించుకొని మిల్క్ ప్రాజెక్టు వద్ద వి.ఎం.రంగ మునిసిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను మేయర్ అందించారు. నగరంలో ఆరోగ్యవంతమైన సమాజ ఏర్పాటులో భాగంగా నగర పాలక సంస్థ, ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు.
ప్రతి విద్యార్ధికి అల్బెండ జోల్ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యార్ధులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, మీరు ఆహారం తీసుకొనుటకు ముందు మీ యొక్క చేతుల శుభ్రంగా కడుగుకోవాలని సూచించారు. కార్యక్రమములో హెల్త్ ఆఫీసర్లు, నగర పాలక సంస్థ సిబ్బంది ఉన్నారు.