లక్షరూపాయల సంపాదనే లక్ష్యం కావాలి: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

నల్లగొండ: తెలంగాణ లో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కుడా అదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలే ఆ లక్ష్యాన్ని చేరుస్తుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండల కేంద్రంలో శనివారం ఉదయం సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో కలసి స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గాధరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యవసాయ గోడౌన్, రైతు వేదికలను ఆయన ప్రారంభించారు.

అనంతరం స్థానిక శాసన సభ్యుడు గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వ్యవసాయంలో విప్లవాత్మక మైన మార్పులు సంభవించాయన్నారు. అందుకు తగ్గట్లుగా పంటల పద్ధతుల్లో మార్పు రావాలని ఆయన చెప్పారు. తెలంగాణ అంటూ ఏర్పడితే మొట్టమొదటిగా అభివృద్ధి చెందేది వ్యవసాయ రంగమేనంటూ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఉద్యమ నాయకుడిగా చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలు అవుతున్నాయాన్నారు. ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ రంగం అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ఆయన కొనియాడారు.

ఒక్కసారి 2014 కు పూర్వంలోకి వెడితే ఆ మార్పు ఇట్టే తెలిసిపోతుందన్నారు. గణాంకాల జోలికి వెళ్లడం లేదని తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన రోజున వెకిలి మాటలు, వేటకారాలు మాట్లాడిన వారిలో ఇప్పటికీ మార్పు రాలేదన్నారు. ఉద్యమం మొదలు పెట్టిన రోజున స్వరాష్ట్రంలో మొదలు లబ్ది పొందేది వ్యవసాయం అన్నప్పుడు నొసలు చిట్లించిన వారే స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అన్న రోజున కుడా అవే వెకిలి మాటలు, వేటకారాలు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. అటువంటి రాష్ట్రంలో అభివృద్ధికి మూలం వ్యవసాయం అన్నది గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు. అందుకు తగినట్లుగానే ప్రజలు ఆశించిన దానికి మించి ప్రపంచానీకె ఆదర్శంగా వ్యవసాయం ఉండేలా తీర్చిదిద్దారన్న్నారు. ప్రజల్లో వ్యవసాయం పట్ల పెరిగిన ఆదరణ, గౌరవాలు ఇందుకు నిదర్శనంగా నిలబడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ స్థానిక జడ్పిటిసి, యంపిపి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

G Jagadish Reddy
Telangana

More Press Releases