రహదారుల నిర్మాణంపై దృష్టి సారించండి: విజయవాడ మేయర్
- ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులకు మేయర్ సూచన
- నగరంలో 600 కోట్లు రూపాయలతో అభివృద్ది పనులు
నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులకు సంబందించి కొన్ని పనులలో ఏర్పడిన జాప్యంనికి గల కారణాలు అడిగి తెలుసుకొని, త్వరలో క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలిస్తానని అన్నారు. నగరంలో రహదారులు, వీధి దీపాలు నిర్వహణ, తాగునీరు అందించడం, పార్క్ ల అభివృద్ది, మొదలగు విషయాలపై అధికారులతో చర్చించి వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గోతులను తక్షణమే పూడ్చివేసి, ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలన్నారు.
అదే విధంగా వివిధ రహదారుల నిమిత్తం అంచనాలు పూర్తి ఆమోదించిన పనులు కూడా వెంటనే మొదలు పెట్టాలన్నారు. వీటితో పాటుగా టెండర్ దశలో ఉన్న పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఉన్న 32 వేల విధిదీపాల నిర్వహణలో ఇబ్బందులు, పాత కరెంట్ పోల్ వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేశారు.
సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ లు జి.నరశింహ మూర్తి, పి.వీ.కృష్ణ భాస్కర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.